ప్రాంతీయం

ఏళ్లరామ్ రెడ్డికి శాల్వాతో ఘనంగా సన్మానం…

185 Views

ముస్తాబాద్, జూన్ 9 ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ హోసూర్ తమిళనాడు వారు సామాజిక సేవలను గుర్తించి ఎన్నారై ఏళ్ల రాంరెడ్డికి తమిళనాడులో గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రధానంచేసి ప్రశంస పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏళ్లరామ్ రెడ్డితో నాడు విద్యను అభ్యసించిన బాల్యమిత్రులు తదితర రంగాలలో స్థిరపడిన వారు హర్షంచి ముస్తాబాద్ మండల కేంద్రంలో రామ్ రెడ్డికి స్వీట్లు తినిపించి అనంతరం ఘనంగా శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు మాజీ విద్యాకమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాసరెడ్డి, బీసీస్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లవెంకటస్వామి, డాక్టర్ రాజేందర్, కూర సంతోష్, రాజాగౌడ్, ఎం.సత్యనారాయణ, కస్తూరి వెంకటరెడ్డి, సందుపట్ల అంజిరెడ్డి, దమ్మ రవీందర్ రెడ్డి, కట్ట బాపురావు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్