నవంబర్ 10 మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న సందర్భంలో మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ గద్దెరాగడి గ్రామంలో ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో గద్దెరాగడి గ్రామ ప్రజలు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో 300 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తాను ఎంపీ పదవిలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. అదేవిధంగా మరింత అభివృద్ధి కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించండి అని ప్రజలను కోరారు.
ఈ కార్య క్రమంలో ప్రభుత్వా మాజి ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, దుర్గం నరేష్, బొద్దున రాజేశ్వరి, భూమయ్య, ఉదరి భూమయ్య, తౌటం సుధాకర్, బండి సదానందం , కుర్మా చిన్న గురువయ్య , కుర్మా భీమేశ్ , గుర్రం శ్రీను, శివ కుమార్, పందిరి లింగన్న, గుర్రం సతీష్, అనిల్ కుమార్, ఉటురి శ్రీనివాస్, కుర్మా సురేందర్ లు మరియు మహిళ నాయకులు పాల్గొన్నారు.
