తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ చెల్లింపునకు ఈసీ బ్రేకులు వేసింది. ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈ మధ్య ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది .
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 2022 జులై నెలకు చెందిన డీఏను ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ అనుమతి కోసం ప్రభుత్వం లేఖ రాసింది.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖపై కేంద్ర నిఘా సంస్థల ద్వారా పూర్వోపరాలు తెలుసుకుంది. ఏడాదిగా పెండింగ్‌లో పెట్టిన డీఏను ఇప్పుడే ఎందుకు ఇస్తున్నట్టు? మరో మూడువారాల పాటు ఆగలేరా? అంత తొందరేమిటీ? అని ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. దీంతో డిఎ విడుదల ప్రక్రియ నిలిచిపోయింది.
