– దేవుడు ఆశీస్సులతో ప్రజల మద్దతుతో హైట్రిక్ విజయం సాధిస్తా
-ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
(మానకొండూర్ నవంబర్ 09)
కుటుంబ సమేతంగా కొండగట్టు అంజన్న ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అనంతరం గురువారం మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రెండు నామినేషన్ సెట్లను దాఖలు చేశారు.
మానకొండూర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కె. లక్ష్మి కిరణ్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు.
అనంతరం రసమయి బాలకిషన్ మీడియాతో మాట్లాడుతూ..
ముచ్చటగా మూడోసారి దేవుడి ఆశీర్వాదంతో మానకొండూర్ నియోజకవర్గ ప్రజల మద్దతుతో నామినేషన్ దాఖలు చేశానని, రెండుసార్లు మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీ అందించి ఆశీర్వదించారని, ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీ తో హాట్రిక్ విజయం అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు..
నామినేషన్ వేసిన ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి,సిరిసిల్ల వైస్ జెడ్పి చైర్మన్ సిద్ధం వేణు,మాజీ సర్పంచ్ ముద్దసాని శ్రీధర్ రెడ్డిలు ఉన్నారు