జన జాతరలో తడిసి ముద్దయిన కవ్వంపల్లి సత్యనారాయణ…
(మానకొండూర్ నవంబర్ 10)
మానకొండూరు నియోజకవర్గంలో ఈరోజు కవ్గంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసారు..
వివిధ మండలాల నుంచి పెద్ద మొత్తంలో కార్యకర్తలు తరలిరావడంతో కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంబించి పోయిందిి..
కాసేపు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జన సంద్రాన్ని చూసి కవ్వంపల్లి సత్యనారాయణ ఉబ్బి తబ్బిపోయాడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంతమంది నాపై ఆదరణ చూపెడుతున్నారని అన్నారు ,
తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని, కార్యకర్తలను చూసి అన్నాడు. కార్యకర్తలను అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగ మారింది,
అనంతరం మాట్లాడుతూ..
పది సంవత్సరాలుగా వైద్యుడిగా మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నానని, నేను దొరలపాలేరును కానని, ప్రజల పాలేరునాని తెలిపారు…
స్థానికేతరుడైన రసమయిని మానకొండూర్ గడ్డ నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చాడు..