రాయపర్తి నవంబర్ 08:
మండల పరిధిలోని జేతురాం తండాలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు కు ఒక మహిళ సద్ది బువ్వను తీసుకొచ్చి ఆప్యాయంగా తినిపించి అమ్మ ప్రేమను చాటింది.అనంతరం మహిళా మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు అందించి మాకు అండగా నిలబడ్డ దేవుడు కేసీఆర్ అని తన మనసులో మాటను వ్యక్తం చేసింది .దయన్న వచ్చిన తర్వాతనే పాలకుర్తి నియోజకవర్గం
అభివృద్ధి చెందిందని మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన తర్వాత
మరింత అభివృద్ధి జరిగిందని ఈసారి కూడా గెలిపిస్తానని
మంత్రికి హామీ హామీ ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో బిల్లా సుధీర్ రెడ్డి. తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.
