Breaking News ప్రాంతీయం రాజకీయం

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు

129 Views

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు

పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పాత బస్టాండ్ లో రాస్తా రోకో చేశారు, ఖాళీ గ్యాస్ సిలిండర్లను, ప్రదర్శించారు, రోడ్డు పై కట్టెల పొయ్యిలు పెట్టి వాటిపై వంటావార్పు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు, బిజెపి పార్టీ ప్రభుత్వం పై మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, దీంతో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, అనారోగ్యంతో ఉన్న ఓ మహిళా కారులో సిరిసిల్ల లోని ఓ ఆసుపత్రికి వెళుతూ రాస్తారోకో లో ఆగిపోగా ఈ విషయాన్ని గన్ మేన్. వెంకన్న గమనించి బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కు చేరవేయగా వెంటనే అయన స్పందించి వారిని స్వయంగా రాస్తారోకో నుంచి తప్పించి సిరిసిల్ల వైపు కారును పంపించి వేశారు,
ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళల ఊసురు తలిగి సర్వ నాశనం అయిపోతుందని ఆమే మండిపడ్డారు,
350 రూపాయల ధర ఉన్న గ్యాస్ సిలిండర్ ను ప్రస్తుతం 1200 రూపాయలకు బిజెపి ప్రభుత్వం పెంచి సామాన్య ప్రజలకు గ్యాస్ సిలిండర్లను దూరం చేస్తుందని దీంతో కట్టెల పొయ్యి లే దిక్కయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ,
అనంతరం బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు, డీజిల్ , గ్యాస్ సిలిండర్ ధరలను ఎన్నోసార్లు పెంచి సామాన్యులపై భారం మోపిందని ఆయన గుర్తు చేశారు,
పెంచిన పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని తగ్గించే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆమె గుర్తు చేశారు,
అనంతరం జెడ్ పి టి సి సభ్యులు చీటీ , లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహారి లు మాట్లాడుతూ పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం వలన సామాన్యుల నడ్ఢివిరిచే విధంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం వ్యవహారిస్తుందన్నారు ,
వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించేదాకా బిఆర్ఎస్ పార్టీ తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు ప్రకటించారు,
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వైస్ ఎంపిపి కదిరే భా‌స్కర్ గౌడ్ , ఎఎంసి మాజీ చైర్మన్ గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎంపిటిసి సభ్యులు మామిండ్ల తిరుపతి బాబు , పందిళ్ళ నాగరాణి పర్షరాములు గౌడ్ ఎలగందుల అనసూయ నర్సింలు, మధు, సర్పంచ్లు కొండాపూర్ బాల్ రెడ్డి, ముక్క శంకర్ , ముక్క మధుకర్, కోల అంజమ్మ నర్సయ్య, , నర్సాగౌడ్ , టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కమాళాకర్ రెడ్డి, కళ్యాణ్ నాయక్, స్వామి , దేవయ్య, బాలమలయ్య , మండల కోఆప్షన్ సభ్యులు జబ్బర్, వైస్ ప్రెసిడెంట్ లు మురళీమోహన్ గౌడ్ , శంకర్ , మండల మహిళా అధ్యక్షురాలు అప్సరా, ,మండల ఎస్ టి సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మన్, మండల ఎస్ టి సెల్ మండల అధ్యక్షులు భూక్య సిత్యానాయక్, సీనియర్ నాయకులు మెగి నర్సయ్య, మీసం రాజం ,వాసరవేణి దేవరాజు , శ్యామంతుల అనిల్ , తదితరులు పాల్గొన్నారు,

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *