– జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి
దౌల్తాబాద్: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల పాఠశాల, దొమ్మాట, సూరంపల్లి, శేరి పల్లి బందారం, లింగరాజు పల్లి తదితర పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పదవ తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం కావాలన్నారు. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు 10 జిపిఎ సాధించేలా సిద్ధం చేయాలన్నారు.పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణతో విద్యార్థులను సన్నద్ధం చేయాలని ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సందేశం ఇవ్వాలని వారిని చైతన్య పరచాలని సూచించారు. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నర్సవ్వ, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రాజు, చంద్రమౌళి పాల్గొన్నారు….