రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శుక్రవారం రోజున శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. వాహనాల చట్టాలపై, ట్రాఫిక్ నియమలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా రెండు నెలల పాటు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో,కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని,శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో విద్యార్థిని విద్యార్ధులకు ట్రాఫిక్ రూల్స్,సిగ్నల్స్, సైన్ బోర్డ్స్, వాహనాల చట్టాలు,రోడ్ భద్రత నియమాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగిందిఅని అన్నారు.
