ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 7, (టీఎస్ 24/7న్యూస్) పోతుగల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పలు కీలక అంశాలపై పలువురు నాయకులు సమగ్రంగా ప్రసంగించాన్నారు. సమావేశంలో కొందరు నాయకులు ప్రత్యేక తెలంగాణ సాధించిన కెసిఆర్ ఏ రాష్ట్రంలో లేని విధంగా పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని స్ఫూర్తి తీసుకుంటుందని ఆకీర్తి కెసిఆర్ కి దక్కిందన్నారు. తెలంగాణలో రైతులకే కాకుండా పేదింటి పెద్దన్నగా, వృద్ధులకు పెద్ద కొడుకులా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, నీళ్లు, నిధులు నియామకాలు వంటి అనేకమైన సంక్షేమ పథకాలతో సేవలందిస్తున్న కెసిఆర్ ను ముచ్చటగా ఈమూడోసారి కూడ ముఖ్యమంత్రిగా కారు గుర్తుకు మనమందరం కలిసికట్టుగా నిలబడి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు. ఈకార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
