ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు..
విద్యార్థులు సామాజిక మాధ్యమాలపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలనీ,విద్యార్థులు మంచివైపు ప్రయాణంచేసి ఉత్తమపౌరులుగా రాణించాలని *షీ టీం ఎ.ఎస్.ఐ ప్రమీల* గారన్నారు.
తేదీ 16-08-2023 రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “షీ టీమ్ అవగాహన సదస్సు” నిర్హహించడం జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ ఎ.ఎస్.ఐ ప్రమీల గారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ ను జాగ్రత్తగా వాడాలని మంచి చెడులు రెండూ ఉంటాయనీ మంచినిమాత్రమే తీసుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ ప్రమాదాలకు దారితీస్తుందనీ , ఆఫర్లపట్ల, డబ్బులు పంపిస్తాం ఒ.టి.పి చెప్పండనీ రకరకాల మెసేజ్లు వస్తాయని తొందరపడి ఓకే చెప్పవద్దనీ, వ్యక్తిగత సమాచారం ఇతరులకు పంపవద్దనీ, ఇనిస్ట్రాగ్రామ్, ఫేస్ బుక్ , వాట్సాప్, ట్విట్టర్ మరియు కొత్త ఆప్స్ మొదలగువాటిపట్ల జాగ్రత్తగా ఉండాన్నారు. ఇంటర్మీడియట్లో టినేజ్ పిల్లలు కావున చెడుపట్ల తొందరగా ఆకర్షణకు గురవుతారనీ మనసును దొరకబట్టి చదువుపై పెట్టాలని అన్నారు.మైనర్లు వాహనాలు నడుపరాదనీ ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతన్నరన్నారు. తప్పడుపనులు చేయకూడదనీ తల్లిదండ్రులకు శోకం మిగుల్చవద్దనీ, తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మంచి విషయాలు శ్రద్ధగా వినాలన్నారు. సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలనీ కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరిస్తామనీ, విద్యార్థులు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలనీ ,చట్టాలపట్ల అవగాహన పెంచుకోవాలనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో *ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ, ఎన్.ఎస్.ఎస్.ప్రోగ్రాం అఫీసర్ వాసరవేణి పర్శరాములు, అధ్యాపకులు మాదాసు చంద్రమౌళి, భూమక్క, నీరటి విష్ణు ప్రసాద్, గౌతమి, ప్రవళిక, సాగర్ మరియు కానిస్టేబుల్స్ శ్రీధర్, రమ మరియు విద్యార్థులు* పాల్గొన్నారు.
