జనగామ నియోజకవర్గంలో విద్యార్థులను,యువతను పట్టించుకోని బిఆర్ఎస్ ఎంఎల్ఏ
పీజీ కళాశాల, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కొరకు ఎన్ని వినతులు ఇచ్చిన పెడచేవున పెట్టిన ఎంఎల్ఏ
ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు
నవంబర్ 2
జనగామ నియోజకవర్గంలోని విద్యార్థులను బిఆర్ఎస్ ఎంఎల్ఏ ఏ మాత్రం పట్టించుకోలేదని ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు ఆరోపించారు. నియోజకవర్గంలో విద్యారంగ అబివృద్ధి శూన్యమన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన స్వార్ధ ప్రయోజనాలకే అధికారాన్ని ఉపయోగించడాని తెలిపారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం చెందారన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్వం చేశాడని మండిపడ్డారు. మళ్ళీ అనురాగ్ యూనివార్సిటీలా స్థాపకుడిని గెలిపిస్తే విద్యార్థులు పూర్తిగా నష్టపోతారని తన కళాశాలలను ప్రయివేట్ యూనివర్సిటీగా చేసుకోవడంపై ఉన్న ప్రేమ పేద విద్యార్థులపై లేదన్నారు.
జనగామ విద్యారంగా అభివృద్ది పై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తొమ్మిదిన్నర ఏండ్లలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు.. ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు? ఎన్ని కొత్త ప్రభుత్వ విద్యా సంస్థలు తెచ్చారు? అని ప్రశ్నించారు.
వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బచ్చనపేట లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటే కనీస స్పందన లేదన్నారు.చేర్యాల మండలంలో ప్రభుత్వ పీజీ కళాశాల, పోస్ట్ మెట్రిక్ వసతి గృహం ఏర్పాటుకు ఇచ్చిన వినతులను పెడచెవిన పెట్టారని అన్నారు. పల్ల రాజేశ్వర్ రెడ్డి తన విద్యాసంస్థల్లో ఎంత మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారో చెప్పాలన్నారు. అధికారం అండతో ప్రయివేట్ యూని వర్సిటీలతో ఫీజులు, డొనేషన్ల పేరుతో లక్షలు దోచుకుంటున్నారని విమర్శించారు.
