ప్రకటనలు

చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా నిర్వహించాలి

188 Views

సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు రేపటి నుండి నామినేషన్ల పక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో చెక్ పోస్ట్ ల వద్ద వాహన తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు.

గురువారం రోజున జిల్లెళ్ల,వెంకట్రావుపల్లి-బదనకల్,పెద్దమ్మ చెక్ పోస్ట్ లను తనిఖీ చేసి వాహన తనిఖీలు చేసి వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించందంతో పాటు, వాహనాలను క్షుణ్ణముగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *