24/7 తెలుగు న్యూస్ నవంబర్ 2
సిద్దిపేట పట్టణంలో క్షుద్ర పూజల సంఘటన కలకలం రేపింది.సిద్దిపేట పట్టణ శివారులోనీ కేంద్రీయ విద్యాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు.
ఆ స్థలంలో నిమ్మకాయలు,గుమ్మడికాయలు,బియ్యం,కొబ్బరికాయ, నల్లకోడినీ కోసి వేప కొమ్మలతో పసుపు కుంకుమ వేశారు దుండగులు. ఈ సంఘటన వల్ల అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
