హైదరాబాద్ అక్టోబర్ 31 : హైదరాబాద్ దళిత జన సమితి రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా దళిత జన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ యాదగిరి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంసెన్సీ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి పై నిన్న జరిగిన కత్తి ఘటన చాలా బాధాకరం.
రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న క్రమంలో,రాజ్యసభ స్థానంలో ఉన్న ఒక ఎంపీ కి ఈ విధంగా జరిగితే, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రజల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లోనే రాజకీయాల్ని చేస్తూ ఎంతో హుందాతనంతో వ్యవహరిస్తున్న ప్రభాకర్ రెడ్డి పై ఇటువంటి సంఘటన జరగడం. రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనం.
ఈ అగైత్యానికి పాల్పడిన నిందితుడు ఎవరైతే ఉన్నారో వారిపై చట్టపరంగా కఠిన శిక్షలు అమలు చేసి, ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.ఈ సమస్య పట్ల దళిత జన సమితి తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు,( డీజే ఎస్ ) రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ బొజ్జ రమేష్ డీజే ఎస్రా ష్ట్ర ఉపాధ్యక్షులు గుండె సంపత్, డీజే ఎస్ రాష్ట్ర కార్యదర్శి భావండ్లపల్లి గంగాధర్, డిజె ఎస్ ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ రాకేష్, డీజే ఎస్ బీసీ సంఘ సీనియర్ నాయకులు ఎదునూరి సంపత్ , డీజేష్మై నార్టీ నాయకులు సయ్యద్ మాజీడ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.