తేది:- 31/10/2023 ఈరోజు భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి వేడుకలు పట్టణ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ మాట్లాడుతున్1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే కొన్ని సంస్థానాలు మేము భారత దేశంలో విలీనం చేయము వేరే దేశంగా ఉంటాము అని అన్నప్పుడు అందులో ఒకటైనటువంటి హైదరాబాదు సంస్థానాన్ని 1948 లో కేంద్ర హోం శాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని ఆర్మీ బలగాలతో ముట్టడించి భారత దేశంలో విలీనం చెయ్యాలని హెచ్చరించడం జరిగింది. అప్పుడు వాళ్లు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. విలీనం జరిగినప్పుడు తెలంగాణకు విమోచనం జరిగింది తెలంగాణ ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి రుణపడి ఉన్నారు ఆ మహానుభావుడు జయంతిని జరుపుకోవడం గర్వంగా ఉంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శంకర్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు గోమాస కమల, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనకం విజయ్, పట్టణ ఉపాధ్యక్షులు మేకల రాజశేఖర్ ముడిమడుగుల శ్రీనివాస్,అడిచెర్ల రామచందర్ పట్టణ కార్యదర్శులు జిమ్మిడి వెంకటేష్ కనకం శ్రీనివాస్ సంతోష్ అగర్వాల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు దార కళ్యాణి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సల్లం.సుమలత పట్టణ యువ మోర్చా అధ్యక్షుడు అజయ్, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాసబోయిన యుగంధర్ ఉపాధ్యక్షుడు జిదుల రాములు, తదితరులు పాల్గొన్నారు.
