ఎమ్మెల్యే రఘునందన్ రావు పై అసత్య ఆరోపణలు మానుకోవాలి.
* బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్.
మండలం సురంపల్లి లో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నందాడి బాధాకరమని దానిని బిజెపి పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు మాదాసు వెంకట్ గౌడ్, ఎన్నిక ప్రచార కార్యదర్శి బాగన్నగారి రవీందర్ రెడ్డి లు అన్నారు.మండల కేంద్రం రాయపోల్ మంగళవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ పై దాడి ఘటనకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా రఘునందన్ రావుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గ్రహించి రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తూ బిజెపి కార్యకర్తలపై భౌతిక దాడులు చేయడం బాధాకరమన్నారు. కొందరు బిఆర్ఎస్ కార్యకర్తలు నిజా నిజాలు తెలియక ముందే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అది మంచి పద్ధతి కాదని రాజకీయంలో ఇంత పర్సనల్గా కక్షలు పెంచుకొని బ్యాలెన్స్ తప్పి ప్రవర్తిస్తున్నారన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై రానున్న ఎన్నికల్లో ఎలాగైనా దుబ్బాకలో సింపతితో గెలవాలని చూస్తున్నారని, దుబ్బాక ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు.బిఆర్ఎస్ నాయకులకు ప్రచారం చేయడం చేతకాక ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.నిరంతరం దుబ్బాక ప్రజల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఎంపీపై హత్యాయత్నం దాడి చేసిన నిందితుడు ఎవరనేది పోలీసులు తేల్చకముందే బిజెపి కార్యకర్త అని మీరు ఎలా డిసైడ్ చేస్తారన్నారు. బిజెపి కార్యకర్తలు పార్టీ సిద్ధాంతం కోసం కట్టుబడి పని చేస్తారని, డబ్బుల కోసం కాదన్నారు. ఎవరైనా సరే నిందితున్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మంకిడి స్వామి, బిజెపి నాయకులు మన్నే ఆంజనేయులు, తలారి నర్సింలు, వెంకట్ గౌడ్, కృష్ణ, స్వామి, భాస్కర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ సింగర బోయిన స్వామి, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.