ఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న
– కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!?
ఎల్లారెడ్డిపేట
నారాయణపురం గ్రామానికి చెందిన దుంపెన రమేష్ తన తండ్రి దుంపెన రాజమౌళి కి చెందిన ఉమ్మడి ఆస్తులను తమ్మునికి తెలువకుండ కాజేసినట్లు బాధితుడు రమేష్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో ఉన్న 200 గజాల భూమి సర్వే నంబర్ 67 గల ప్లాటును నా ప్రమేయం లేకుండానే మా అన్న కిషన్ తండ్రితో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వేములవాడలో ఉన్న ఫ్లాటు సర్వే నెంబర్ 181 గల ప్లాటును కూడ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్ల క్రితం నా సోదరుడు కిషన్ ఉద్యోగరీత్య సిరిసిల్ల పట్టణానికి వెళ్లగా అప్పటినుండి నేనే స్వయంగా నా తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో సేవలను అందిస్తున్నాను. నన్ను వేరు చేసి తెలువకుండానే ఆస్తులను ఆక్రమించుకున్నట్లు ఆరోపించారు ఈ విషయంపై తన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకున్నప్పటికీ అందుకు తన అన్న కిషన్ నిరాకరించినాడు. ఇప్పుడు మా అన్న ఆక్రమించుకున్న ఆస్తులను గ్రామస్తులు తగు చొరవ చూపి పరిష్కరించాలని కోరుచున్నాడు.
