ప్రాంతీయం

బిజెపి కార్యకర్తలకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా?*

412 Views
  1. *బిజెపి కార్యకర్తలకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా?*

    ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం చేసింది బిజెపి కార్యకర్త అంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి పై ఎందుకు చట్టరిత్య చర్యలు తీసుకోవడం లేదని పోలీసులను ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు బిజెపి కార్యకర్తలు మహిళలను సోషల్ మీడియాలో కించపరిస్తే ఎందుకు బాధ్యత వహించలేదని దళిత బహుజన, మైనారిటీ, సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో దళిత బహుజన, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు రాంపల్లి సతీష్,తుడుం ప్రశాంత్, మహమ్మద్ రఫీ, చాకలి స్వామి మాట్లాడుతూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం చేసిన రాజు బిజెపి కార్యకర్త అంటూ అతని ఫోటోను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సంఘటన జరిగిన నాలుగు గంటలలోనే స్పందించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేట పోలీస్ కమిషనర్ అసత్య ప్రచారాలు చేసే వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు.నిరుపేదలు, అనాధలకు నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేసే సంఘసేవకురాలను 15 రోజుల క్రితం బిజెపి కార్యకర్త సత్యం కించపరిచే విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తే ఎందుకు ఎమ్మెల్యే బాధ్యత వహించలేదు. అతడిని పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదు ? చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. సమస్య మీ వరకు వస్తే ఒక విధంగా, ఇతరులకు అయితే ఒకే విధంగా ఉంటుందా ? బాధ్యతయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి నిందితులకు కొమ్ము కాస్తూ 15 రోజులు గడిచినగాని పోలీసులకు దొరకకుండా ఉంచుతారా అని మండిపడ్డారు. ఆత్మగౌరవం మీకే ఉంటుందా ? ఇతరులకు ఆత్మగౌరవం ఉండదాని ప్రశ్నించారు. బిజెపి పార్టీ సిద్ధాంతం అంటేనే భారతమాతను గౌరవిస్తూ మహిళలను గౌరవిస్తామని, దేశం కోసం ధర్మం కోసం అంటూ గొప్పలు చెప్పుకునే మీరు మైనారిటీ మహిళలను కించపరిస్తే ఎమ్మెల్యే కానీ, బీజేపి నాయకులు కానీ ఎందుకు స్పందించలేదన్నారు. మహిళల పట్ల మీకు మీ పార్టీకి ఉండే గౌరవం ఇదేనా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన మైనార్టీ సంఘాల నాయకులు విష్ణు, మాసాన్ పల్లి రాజు, అజయ్, శివకుమార్, భాను ప్రసాద్, జిల్లా రాజు, ఇషాక్, నవీన్, నాగరాజు, శ్రీకాంత్, సాయి కమార్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *