*ఎంపీని కత్తితో పొడిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి.*
మెదక్ ఎంపీ,బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హాత్యాయత్నం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ఉపేక్షించరాదని రాయపోల్ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి,యువజన విభాగం మండల అధ్యక్షులు తీగుళ్ల స్వామి, రైతుబంధు గ్రామ అధ్యక్షులు నరసింహారెడ్డి, వడ్డేపల్లి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పెయింటర్ రవి అన్నారు. సోమవారం రాయపోల్ మండల కేంద్రంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడికి నిరసనగా రాస్తారోకో నిర్వహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వడ్డేపల్లి గుర్రాలసోఫా వద్ద బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ఎంపీకి కలిసి కరచలనం ఇవ్వడానికి వచ్చి కత్తితో దాడి చేసి హత్యయత్నం చేయడానికి ప్రయత్నించిన బీజేపి కార్యకర్త గటని రాజును కఠినంగా శిక్షించాలన్నారు. బీజేపి పార్టీ ఉత్తర భారతదేశ దాడుల సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తుందని, ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలలో రఘునందన్ రావు గెలుపొందినప్పటి నుంచి దాడులు,అరాచకాలు అధికమవుతున్నాయన్నారు.రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికలలో ఎమ్మెల్యే రఘునందన్ రావు దాడులు చేసిన, హత్యలు చేసిన, భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించిన ఎలాగైనా సరే ఓట్లు వేయించుకొని ఎన్నికలలో గెలవాలని కార్యకర్తలను రెచ్చగొడుతూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని, వాటిలో భాగంగానే దుబ్బాక నియోజకవర్గంలో అలాంటి ఘటనలకు బిజెపి కార్యకర్తలు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలలో పోటీచేసి ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపొందాలి తప్ప దాడులు, హత్యలు చేసి గెలుపొందకూడదన్నారు.రఘునందన్ రావు ఇలాంటి చర్యలకు పాల్పడితే నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అడ్డుకొని తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల మధ్యన తిరగాలని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు స్వామి,మాజీ ఏఎంసి డైరెక్టర్ రాజు,రాంపల్లి సతీష్, జీవన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఇస్తారీ,స్వామి,అశోక్, శివకుమార్,అజయ్, బాలకృష్ణ,రాంపల్లి స్వామి,శ్రీకాంత్,నవీన్, ఇషాక్, ప్రశాంత్ సుధాకర్ సందీప్ రెడ్డి ఆంజనేయులు స్వామి దేశమంత రెడ్డి,మంజూరు,నాగరాజు, వంశీ,పంబాల భాను,శ్రీనివాస్,స్వామి,అశోక్, ప్రభాకర్,రఫీ,భూపాల్ రెడ్డి, అయ్యగాల రవి, తదితరులు పాల్గొన్నారు.