ముస్తాబాద్, సెప్టెంబర్26,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన చిట్యాల చాకలి ఐలమ్మ128, జయంతి సందర్భంగా మోహినికుంట గ్రామంలోని రజక సంగం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం పూలమాలవేసి వేడుకలు జరుపుకొని నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని అన్నారు. ఈకార్యక్రమంలో రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
