మంచిర్యాల జిల్లా
డా.కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హోమియోపతి మందులతో దీర్ఘ కాలిక వ్యాధులు నయమవుతాయని రహీమ్ బ్లడ్ వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహీమ్, మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఇరికిల్ల పురుషోత్తం పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రం లోని జన్మ భూమి నగర్ లో గల రాముని చెరువు ఆవరణలో డాక్టర్ కేర్ హోమియోపతి ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యుడు డా.మల్లేష్, మంచిర్యాల ఆసుపత్రి మేనేజర్ రజిత, డాక్టర్ కేర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు గా 120 మందికి పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరు శ్రద్ధ వహించాలన్నారు. హోమియోపతి వైద్యంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స ఉంటుందన్నారు. ఐబీ లోని డా.కేర్ ఆసుపత్రి ను సంద్శించాలన్నారు.
ఈ కార్యక్రమం లో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు డా.నీలకంటేశ్వర్ గౌడ్, రాజునాయక్, గీత, విజయ్, రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ అబ్దుల్ రహీమ్ తదితరులు పాల్గొన్నారు.






