రాజకీయం

కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్

444 Views

హైదరాబాద్: అక్టోబర్ 30

బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని సీఎం అన్నారు. అనంతరం దుర్ఘటనపై మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఫోన్లో ఆరా తీశారు.
కొత్త ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *