త్వరలో జరగనున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో చేపట్టే నామినేషన్ ప్రక్రియ పై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలనీ కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారీ అనురాగ్ జయంతి అన్నారు.
బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హల్ లో నామినేషన్ దాఖలు ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ లపై రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులు జిల్లా నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.మాస్టర్ ట్రైనర్లు నామినేషన్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ లపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. నామినేషన్ స్వీకరించే రోజు నుండి ప్రక్రియ ముగిసే రోజు వరకు ఉదయం 11:00 గం.ల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్ దాఖలు సమయమన్నారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయాలన్నారు. నామినేషన్ దాఖల సమయం లో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ లో ఎలాంటి బ్లాంక్ లేకుండా చూసుకోవాలి అన్నారు. చెక్ లిస్ట్ ప్రకారం నామినేషన్ పారం అభ్యర్థులు సమర్పించేలా చూడాలన్నారు. నామినేషన్ల స్కూటీని రిటర్నింగ్ అధికారి మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు.
