శ్రీమతి సావిత్రిబాయి పూలే మహాత్మ జ్యోతిబాపూలే ల విగ్రహాల ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ” ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున అంగరంగవైభవంగా నిర్వహించారు.
అయితే ఆ విగ్రహల ఆవిష్కరణకు తనవంతుగా ఆర్థిక సహాయం అందించిన నాగెల్లి దేవానంద్ ని ముదిరాజ్ సంఘం తరుపున ఘనంగా బుధవారం రోజు సన్మానించడం జరిగింది.
శ్రీ నాగెల్లి దేవానంద్ (ముంబై) మాట్లాడుతూ విగ్రహాల ఆవిష్కరణ కొండాపూర్ లో చేయడం అంటే కొండాపూర్ గ్రామం అభివృద్ధి పధం లో నడుస్తుందని మరియు యువతకు సమాజం పట్ల పూర్తి అవగాహన మరియు అభ్యుదయ స్ఫూర్తి ఉందని అనడానికి నిదర్శం అన్నారు. అదేవిధంగా ఇలాగే అన్ని రంగాల్లో కొండాపూర్ యువత ముందుకు వచ్చి గ్రామాన్ని మరియు సమాజాన్ని అభివృద్ధి దిశలో నడిపించాలని కోరారు . ముదిరాజ్ సంఘానికి మరియు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెల్పారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి చిగురు దేవేందర్, గణాది నర్సయ్య, చిగురు పెద్ద రాజం, చిగురు పెద్ద నర్సయ్య, చిగురు యాదయ్య,చిగురు వెంకటి, చిగురు ఖాషయ్య, చిగురు నరేష్, చిగురు శంకర్, చిగురు రాములు, చిగురు నరేష్, గణాది రాజు, చిగురు పర్శరాములు, కొలకాని కిషన్, నాగెళ్లి ప్రశాంత్ , మర్వాడి గంగరాజు, చిగురు ఈశ్వర్, నవాబ్, సుతారి కిషన్, సర్థాని శంకర్, సర్థాని బాల్ రాజ్, పెద్దూరి శ్రావణ్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
