గ్రామ దేవతకు దున్నపోతు బలి..
ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట గ్రామస్తులు రైతులు పంట పొలాలు చల్లగా ఉండాలని ఏలాంటి వ్యాధులు రాకుండా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు ఊరు మీద గత రెండు సంవత్సరాల నుండి దున్నపోతును మైసమ్మకు వదిలిపెట్టారు ఆదివారం రోజు డప్పు చప్పులతో ఊరేగింపుతో మేకపోతు గొర్రెపోతు దానికి తోడుగా అర్ధరాత్రి రాత్రి 11 గంటలకు ప్రాంతంలో బలి ఇవ్వడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు ఈ యొక్క బలి ఇచ్చిన తర్వాత గ్రామస్తులు సంతోషంతో వంటలు చేసుకుని వనభోజనాలు చేసుకొని సంబరాలు చేసుకుంటారు దీనికి రైతులు ఇంటి ముందు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటూ సాగనంపారు కులాలకు కచ్చితంగా ఊరు మీద మైసమ్మం చేయడం ప్రతి సంవత్సరం అన వాయితి దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఊరేగింపుతో ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట సరిహద్దులో ఉన్న సముద్రా లింగాపూర్ ఏడు గ్రామాల నీటి పారకం ఉన్నందున మైసమ్మకు బలి ఇవ్వడం జరుగుతుంది దీనికి అధిక సంఖ్యలో రైతులు మరియు గ్రామస్తులు హాజరుకావాలని ఎల్లారెడ్డిపేట సర్పంచి నెవూరి వెంకట్ రెడ్డి కోరారు
