పుట్ట రాజవ్వ స్మారకార్థం టేక్ కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత……
తల్లి స్మారకార్థం కూతుర్ల పంపిణీ
ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట :
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, కరీంనగర్ నమస్తే తెలంగాణ సీనియర్ సబ్ ఎడిటర్ పుట్ట రమేష్ రామవ్వ, బాలవ్వ, దేవవ్వ, వెంకటమ్మ, సత్తవ్వ, డే కేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
