కామ్రేడ్ జయరాములు ఆశయాలను నెరవేరుస్తాం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
అక్టోబర్ 24
కామ్రేడ్ కమలాపురం జయరాములు ఆశయాలను నెరవేరుస్తామని సీపీఐ(ఎం)సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు.జయ రాములు 3 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం చేర్యాల పట్టణ కేంద్రంలోని పెద్దమ్మగడ్డ వద్ద ఉన్న జయరాములు స్థూపానికి మల్లారెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ సిపిఎం పార్టీ పట్ల అచంచల విశ్వాసంతో సుదీర్ఘకాలంగా పార్టీలో నమ్మకంతో పనిచేసిన కార్యకర్త అని కొనియాడారు. చేర్యాల ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలలో ముందుండి చురుకుగా పాల్గొని పనిచేశారని తెలిపారు.
చేర్యాల గ్రామపంచాయతీ వార్డు సభ్యునిగా ఉండి గ్రామంలోని అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేశారన్నారు. జయరాములు ఆశయాలను ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జయరాములు కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి కళావతి, రాళ్ల బండి శశిధర్, చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, నాయకులు పోలోజు శ్రీహరి, ముస్త్యాల ప్రభాకర్, బోయిని మల్లేశం, మేడిపల్లి చందు, బుట్టి చందు, జయరాములు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
