నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి మండలంలోని ఎల్లారెడ్డి గూడ గ్రామంలో గురువారం శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్న సంస్థ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మీలా సోమయ్య గుప్తా, అధ్యక్షులు రంగ శేఖర్ గుప్తా, ఉపాధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గుప్తా ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 122వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు గాని, మహాత్మా గాంధీ గాని మన ఆర్యవైశ్య జాతిలో పుట్టడం ఆర్యవైశ్య జాతికే గర్వంగా భావిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు యాదా శ్రీనివాస్ గుప్తా, తడక మల్ల చంద్రయ్య గుప్తా, ఓరుగంటి పరమేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి రంగా కృష్ణయ్య, సహాయ కార్యదర్శి మానాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.