వరి ధాన్యం కటింగ్ చేసిన వాటితోనే రైతు బందు ఇస్తున్నారు
కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్… ప్రస్తుతం రైతుల వద్ద నుండి తాలు,పొల్లు ,పేరిట వడ్లు కటింగ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 40 కిలోలు తూకం వేయాల్సిన వడ్లు అదనంగా రెండు,మూడు కిలోలు తూకం వేసి కటింగ్ ద్వారా వచ్చిన డబ్బులను రైతు బందు పథకం కింద రైతులకు డబ్బులు ఇస్తున్నారని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆరోపించారు.మండల కేంద్రము లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు బందు పేరిట ఇచ్చిన డబ్బుల కంటే వరి ధాన్యం కటింగ్ పేరిట క్వింటాల్ కు ఆరు కిలోల వడ్లు అదనంగా తూకం వేసి దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.రైతులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పై పునరాలోచించుకుని ఈ నెల 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు.ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దొమ్మటి నర్సయ్య,కాంగ్రెస్ నాయకులు అంతేర్పుల గోపాల్,మైనార్టీ సెల్ మండల అద్యక్షులు రఫిక్ తదితరులు ఉన్నారు.
