మంచిర్యాల జిల్లా
రామగుండం పోలీస్ కమిషనరేట్
తేది :24-10-2023
కేంద్ర బలగాల అధికారులు, సిబ్బంది తో బ్రీఫింగ్ సెషన్ నిర్వహణ.
రామగుండం కమిషనరేట్ లో ఎన్నికల బందోబస్త్ లో 230 మంది సి ఆర్ పి ఎఫ్ మహిళ కమాండోలు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి ) బ్రీఫింగ్ సెషన్ సమావేశాన్ని నిర్వహించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో కేంద్ర బలగాలు రామగుండం కమిషనరేట్ పోలీసులతో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా, ఓటర్ల కు భయాందోళనలకు అవకాశం లేకుండా తమ ఓటు హక్కు ను స్వేచ్ఛ గా వేయడం లో భరోసా కల్పించడం లో భాగంగా ఫ్లాగా మార్చ్, రూట్ మార్చ్ లు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఎన్నికల రోజు, ఎన్నికల తరువాత బందోబస్త్ విధులు నిర్వర్తించాలని, ఎన్నికల రోజు ఎల్ డబ్ల్యు ఈ పోలింగ్ స్టేషన్‌లు, క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లలో స్టాటిక్ బందోబస్త్ మరియు మిగతా ఫోర్స్ రూట్ బందోబస్త్ మరియు అత్యవసర పరిస్థితి సమయం లో విధులు నిర్వహించడం జరుగుతుంది అన్నారు., ఎస్ ఎస్ టి టీమ్స్ డ్యూటీ లు ఎల్ డబ్ల్యు ఈ ఏరియాలో ఏరియా డామినేషన్, కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్, విధుల గురించి వారికి వివరించారు మరియు కీలకమైన పాయింట్‌ల వద్ద సెంట్రల్ ఫోర్స్ సిబ్బందిని ఉంచడం జరుగుతుంది అన్నారు. కేంద్ర బలగల ఉండడానికి సరైన వసతి ఏర్పాట్లు చేయాలని, వారితో కలిసి పనిచేయాలని ఏసీపీలను ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.
రాబోయే ఎన్నికల భద్రతలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కు ప్రస్తుతం ఐదు సి ఆర్ పి ఎఫ్ కంపెనీ బలగాలు రాగా అందులో మొత్తం అధికారులు, సిబ్బంది మొత్తం 284 రాగ అందులో మహిళల అధికారులు, సిబ్బంది వారిగా డిప్యూటీ కమాండెంట్ -01 అసిస్టెంట్ కమాండెంట్-03, మహిళ ఇన్స్పెక్టర్ లు-09,. మహిళా సబ్ ఇన్స్పెక్టర్ లు – 14,మహిళల ఏ ఎస్ ఐ లు-12, మహిళల హెడ్ కానిస్టేబుల్స్- 19,మహిళా కానిస్టేబుల్స్..174, మొత్తం 230
ఈ సమావేశం లో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఐపిఎస్., ఏ ఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్,అడిషనల్ కమాండెంట్ దినేష్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ మాంజిమ కురియాకోసే, అసిస్టెంట్ కమాండెంట్ మంజుల, సంఘమితిరై,. దీపిక, ఏసీపీ లు పెద్దపల్లి ఏడ్ల మహేష్,గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, జైపూర్ ఏసీపీ మోహన్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, వెంకటేశ్వర్లు, ఏ ఆర్ ఏసీపీ లు మల్లికార్జున్, సుందర్ రావు, సీఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.
