ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 24, కొండాపూర్ గ్రామంలో ఐదులక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక వేత్త నాగేల్లి దేవానంద్ ముందుకు వచ్చారు. ఆయన గ్రామం కొండాపురం అయినా వృత్తిరీత్యా ముంబైలో ఉంటూ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు దేవానంద్ ఆలయాన్ని దర్శించి తనవంతు సహాయం అందించారు. అలాగే గ్రామస్తులకు ఆధ్యాత్మిక భాగంగా ఎటువంటి సహాయం కావాలన్న తనను సంప్రదిస్తే తప్పకుండా తనవంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐయినేని బాల్ రెడ్డి, ఐయినేని నారాయణరెడ్డి, గుడి కందుల పాపి రెడ్డి, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ బొందుగుల దేవరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు నిమ్మ రాజిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు నిమ్మ దేవరెడ్డి, మాజీ ఎంపిటిసి నారోజు రాజు, మార్వాడి గంగరాజు, గుడి కందుల రాజిరెడ్డి, మాదాసు భూమయ్య, న్యాలం బాలగౌడ్, ఏకల్దేవి మల్లయ్య, గుడికందుల మహేందర్ రెడ్డి, గంధం మల్లయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విరాళాలు అందిస్తూ సాయిబాబా గుడి నిర్మాణనికి కూడా ఐదు లక్షల రూపాయలు విరాళం అందించిన కొండాపూర్ గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నాగెల్లి దేవానంద్ కు సమస్త దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మరింత ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఆలయ కమిటీ, కొండాపూర్ గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
