యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం ( కైలాసపురం) రేణుకా ఎల్లమ్మ దేవాలయం అధ్యక్షులు ఐవీఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ ఛైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గురువారం హైదరాబాద్ లో మాజీ ఎంపీ టీజీ.వెంకటేష్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల.శ్రీనివాస్ గుప్తా ను కలిసి యాదాద్రి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, ఈ సందర్భంగా మాజీ ఎంపీ టీజీ.వెంకటేష్, ఉప్పల శ్రీనివాస్, ఐ వి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ గుప్తాకు ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది అని అన్నారు