నవంబర్ 12
నిరుపేద ఆర్యవైశ్యుడికి అండగా నిలిచి దాతృత్వం చాటుకొని శభాష్ అనిపించుకున్న జగదేవపూర్ మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద ఆర్యవైశ్య యువకుడు బాలరాజు కు ఆదివారం స్థానిక ఆర్యవైశ్య నాయకులు 1,01016 రూపాయలు అందజేసి దాతృత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా ఇటిక్యాల సర్పంచ్ ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షులు రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ నిరుపేద వైశ్యుడు తల్లి తండ్రులని కోల్పోయిన బాలరాజు కరాటే లో రాణించి ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు ఇతనికి స్వంత ఇల్లు లేదు అక్క చెల్లెళ్ల పెళ్లిళ్ల కు శక్తికి మించి మంచి సంబంధాలను చూసి పెళ్లి చేసి సంతోషంగా ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు త్వరలో ఒక ఇంటి వాడు కావాలని కలలు కన్నారు విధి వక్రించి ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ ,పక్షవాతం రావడంతో గజ్వేల్ హాస్పిటల్ లో చికిత్స పొందారు కొద్దికొద్దిగా కోలుకుంటున్నారు వైద్య ఖర్చుల కోసం వారికి అండగా నిలవడానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు పెద్ద మనసు చేసుకొని తలా కొంత సొమ్ముతో లక్ష ఒక వెయ్యి పదహారు రూపాయలు అందజేయడం అభినందనీయమని అన్నారు, ఇంకా ఎవరైనా సహాయం చేసే వారు ఉంటే జగదేవపూర్ పట్టణ ఆర్యవైశ్యులను సంప్రదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు బుద్ధ మహేందర్, సముద్రాల హరినాథ్,బుద్ధ సత్యం, ఆర్యవైశ్య సంఘం మండల అద్యక్షులు మడిపడిగ చంద్ర శేఖర్, నాచారం దేవస్థానం డైరెక్టర్ నాజరాజు, పట్టణ అధ్యక్షులు కుకటపు కొండలు,జిల్లా కార్యదర్శి అమర రాము,మండల కార్యదర్శి వల్లాల వెంకటేశం,పట్టణ కోశాధికారి జిల్లా కిరణ్,లక్ష్మణ్,మరియు వెంకటేశం,కైలాసం,రమేష్, లక్ష్మి నర్సయ్య,కృష్ణ,రమేష్, శివ కుమార్,ఆర్ శ్రీనివాస్, రవి, రామ్ నివాస్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
