శముస్తాబాద్, ప్రతినిధి జూలై 5, వేములవాడ పట్టణంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేయడంపై బీసీ విద్యార్థి సంఘం పక్షాన ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అలాగే కొన్ని పాఠశాలలో బుక్స్ డ్రెస్సులు అమ్ముతున్నారని వాటిపైన చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోని ఎడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
