-సమస్యల అవగాహన ఉన్న స్థానికుడిని
-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరెపల్లి మోహన్.
(తిమ్మాపూర్ అక్టోబర్ 24)
నేదునూర్ పవర్ ప్రాజెక్టు కోసం రైతుల నుండి సేకరించిన భూనిర్వాసితులను స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పట్టించుకోవడం లేదని మానకొండూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ ఆరోపించారు. మంగళవారం రేణికుంట, గొల్లపెల్లి, లక్ష్మీదేవిపల్లి, నేదునూర్, వచ్చునూర్, రాంహన్మాన్ నగర్, జూగుండ్ల గ్రామాల్లో ఎన్నిక ప్రచారం నిర్వహించారు.అంతకుముందు రేణికుంట, గొల్లపెల్లి లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వచ్చునూర్ లో ఆరెపల్లి మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో చాలా సమస్యలున్నాయని వాటిని పట్టించుకునే స్థితిలో ప్రజాప్రతినిధులు లేరని విమర్శించారు.సమస్యలపై అడిగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై రసమయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విషయాన్ని ఎంతోమంది తనకు తెలుపుతున్నారని పేర్కొన్నారు.గొల్లపెల్లి నుండి జూగుండ్ల వరకు జరిగిన అభివృద్ధి పనులన్నీ తన పరిపాలనలో జరిగినవే తప్ప,ఎటువంటి కొత్త పనులను రసమయి చేయలేదని అన్నారు.ఎన్నో రకాల మౌలిక సదుపాయాలు లేని గ్రామాలుగా మిగిలిపోయాయని అన్నారు.
ఈ గ్రామాలకు సమస్యలన్నింటి పై తనకు పూర్తి అవగాహన ఉందని ఆరెపల్లి పేర్కొన్నారు.దళితుల సంక్షేమం పై తాను కట్టుబడి ఉంటానని వారికోసం అన్నారు.పేద ప్రజల అభ్యన్నతి కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశ వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాల్లో వివక్ష లేదని అందుకు నిదర్శనం కరోనా కాలంలో ఇంటింటికి అందించిన వాక్సినేషన్ కార్యక్రమమేనని అన్నారు.
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పిటీసి ఎడ్ల జోగిరెడ్డి, బీజేపీ నాయకులు బూట్ల శ్రీనివాస్, మావురపు సంపత్,చింతం శ్రీనివాస్,కరివేద లక్ష్మారెడ్డి,గొట్టిముక్కల తిరుపతి రెడ్డి,తమ్మనవేణి రాజు యాదవ్,బోనాల మోహన్,కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, కాల్వ శ్రీనివాస్,గడ్డం అరుణ్,ఎల్కపల్లి స్వామి,జంగ సునీల్ రెడ్డి, పాశం రాఘవరెడ్డి,వడ్లకొండ శ్రీహరి,బుర్ర శ్రీనివాస్ గౌడ్,ఉప్పులేటి జీవన్, బాబు,మేకల శ్రీనివాస్,పల్లె కుమార్,ఉప్పునూటి సాగర్, చందు, కొలిపాక రమేష్ తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.