సమస్యలకు నిలయంగా స్మశాన వాటిక
స్మశాన వాటికను పట్టించుకోని పాలకవర్గం
స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువ
లక్షలు వెచ్చించి స్మశాన వాటిక నిర్మిస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం అయ్యేనా
స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తుల ఆందోళన
అక్టోబర్ 24
సిద్దిపేట్ జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో స్మశాన వాటిక సమస్యలకు నిలియంగా మారిందని, స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేవని
కనీస సౌకర్యాలు వెంటనే కల్పించాలని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ స్మశాన వాటికలో కరెంటు సౌకర్యం లేదని, నీటి సౌకర్యం లేదని, రోడ్డు సౌకర్యం లేదని, పై కప్పు సరిగ్గా లేదని, మరుగుదొడ్లు లేవని, కట్టిన గోడలు పగులు పట్టాయని కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు
అధికారులు ప్రజాప్రతినిధులు స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించినట్లయితే ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు
అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్ల లక్షలు వెచ్చించి ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని గ్రామస్తులు మండిపడుతున్నారు
సంవత్సరాలు గడిచిన లక్షలు వెచ్చించిన స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువేనా అని ప్రజలు చర్చిస్తున్నారు
ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్మశాన వాటిక మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చర్చిస్తున్నారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కోట వెంకటస్వామి, పోరెడ్డి రమేష్, పోరెడ్డి కనకయ్య, బోయిని బాలరాజు,, గూడూరు యాకోబ్, పులిగిల్ల కనకయ్య, ఎండి ఐబు,, పాల వెంకటేశం, ఆరెపల్లి సురేష్, అరపెల్లి వరుణ్, మేడ మీద నరేష్, పులిగిల్ల నవీన్, మామిళ్ల సాయి, మాడబోయిన అజయ్ తదితరులు పాల్గొన్నారు
