ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 24, కేంద్రంలోని కూరగాయల మార్కెట్ పక్కన శివాలయంకు ఆనాదికాలం నుండి పురాతన దేవాలయంకు ఎంతోమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు. ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖ మండపములకన్నా లోతులో శివలింగం ఉండడం విశేషం. మండల కేంద్రంలోని జనవాసాల మధ్యలో ఈ ఆలయం ఉన్నా పిచ్చిమొక్కలతో చిట్టి అడివిని తలపిస్తుంది. తెలంగాణ సాంస్కృతి బతుకమ్మ దసరా పండుగలు హిందువులకు పెద్దపండగని చెప్పుకోవచ్చు కాని మేజర్ గ్రామపంచాయతీ అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం కొసమెరపు. ఈశివాలయం ముందు కూరగాయలు, శివాలయం వెనుక నిరుపయోగంగా రెండు చేపల, కూరగాయల మార్కెట్ షెడ్లు, మండల కేంద్రంలో మెయిన్ సెంటర్లో ఉన్న ఈఆలయానికి ప్రధాన ముఖద్వారం తప్ప చుట్టుపక్కల మరుగుదొడ్లు మూత్రశారులకు అపరిశుభ్రత వాతావరణం ఆవాసంగామారి పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగి భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాయంటున్నారు. చుట్టుపక్కల అడవి తలపించడంతో రాత్రి వేళలో కొందరు ఆకతాయిలు చేపల మార్కెట్ షెడ్డును అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా వాడుకుంటున్నారని స్థానిక ప్రజల వాదన. మండల అధికారులు అభివృద్ధి పనులలో విఫలమయ్యారని స్థానికులు వాపోతున్నారు. మెయిన్ రోడ్డుకు సుమారు100 మీటర్ల దూరంలో ఉన్న శివాలయం చుట్టుపక్కల పరిశుభ్రత లోపించడం ఎవరు పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజలకు చర్చనీయ అంశంగా మారిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
