బాల్య మిత్రుల ఔదార్యం
బలరాం కుటుంబానిక 50వేల ఆర్థిక సహాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం లోని
ఆనారోగ్యంతో మృతి చెందిన బలరాం కుటుంబానికి బాల్య మిత్రులు బాసటగా నిలిచి తమ ఔదార్యాన్ని చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామానికి చెందిన కంది బలరాం (40) 15 రోజుల క్రితం అనారోగ్యం, కటిక పేదరికంతో మృతి చెందాడు. ఆయన మరణించిన విషయం తెలుసుకున్న వెంటనే 1997– 1998 పదో తరగతి బాల్య మిత్రులు ఆదివారం బలరాం కుటుంబానికి 50వేలు అందజేశారు. ఎల్లారెడ్డిపేట, దుమాల, అక్కపల్లి గ్రామాలకు చెందిన స్నేహితులు తలా కొంత జమ చేసి బలరాం కుటుంబ సభ్యులకు అందజేసి భరోసా నిచ్చారు. ఎల్లారెడ్డిపే ప్యాక్స్ చైర్బన్ కృష్ణారెడ్డి, పరికి స్వామి గౌడ్, చందనం రఘు, ఆఫీస్, అనిల్, దేవేందర్,బాబు, శేషు తదితరులు బలరాం కుటుంబాన్ని ఓదార్చారు. కార్యక్రమంలో అక్కపల్లి సర్పంచ్ మధుకర్, ఉప సర్పంచ్, ప్రదీప్ రెడ్డి, బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
