కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

ఉన్నత చదువులు చదివి జీవన ఉపాధి మిల్లెట్ అంటు.. తక్కువ ధరకే సేవలు…

74 Views

భారీగా తగ్గించిన టిఫిన్, భోజనం ధరలు

ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడకుండా హోటల్ నడిపిస్తున్న దంపతులు….

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చిరుధాన్యాలతో చేసిన అల్పాహారం అందిస్తున్నారు

ప్రభుత్వం  ఆదుకోవాలి…

రాజన్న సిరిసిల్ల జిల్లా: డిసెంబర్ 20
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోటల్ యజమాని కట్కూరి బాబు- భారతిలు నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లారెడ్డిపేట మండల నివాసులు, సిరిసిల్లలో ఈ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా టిఫిన్, భోజనం ధరలు భారీగా తగ్గించారు, బాబు(36) B-Tech పూర్తి చేశాడు,భార్య భారతి(34),B,Com కంప్యూటర్ పూర్తి చేసింది, భార్యాభర్తలు ఉన్నత చదువులు చదివి కొద్ది రోజులు ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేసి, ప్రభుత్వ ఉద్యోగం రాక నిరుత్సాహపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలని అవమానంగా భావించకుండా సొంతంగా సిరిసిల్ల పాత బస్టాండ్ ఏరియాలో హోటల్ పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చిరుధాన్యాలతో మిల్లెట్స్ అల్పాహారం అందిస్తున్నారు,నూతన సంవత్సరం సందర్భంగా ఆస్పత్రులకు వచ్చే రోగులను, నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరలో టిఫిన్ 20/- కూరగాయల భోజనం 30/, మాంసాహార భోజనం 50/- రూపాయలకు అందిస్తూ ఆదర్శంగా నిలిచారు, ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని పలువురు ప్రజలు తెలుపుతున్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్