త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజన్న సిరిసిల్ల పోలీసు సిబ్బందికి సహాయంగా బి ఎస్ ఎఫ్ రెండు కంపెనీల 200 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు రావడం జరిగింది.
సోమవారం రోజున జిల్లా కేంద్రంలో 100 మంది జిల్లా పోలీస్ సిబ్బందితో కలిసి, 200 మంది కేంద్ర బలగాలతో కలసి ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జెండా ఊపి ప్రారంభించి వారితో పాటుగా సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ,అంబేద్కర్, గోపాల్ నగర్ చౌరస్తాల మీదుగా బీ.వై నగర్, సంజీవయ్య నగర్,వెంకంపెట్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు కొనసాగిన కవాతులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ,..అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని,ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, రాబోయే ఎన్నికలకు సంబంధించి జిల్లాకు 200 మంది బృందంతో కూడిన కేంద్ర బలగాలు వచ్చాయని త్వరలో మరిన్ని బలగాల వస్తాయని అన్నారు.శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని అన్నారు.
