ప్రాంతీయం

ఎంపీడీఓ చేసిన వాక్యాలపై సిఐటీయు, సిపిఎంల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో …

122 Views
      ముస్తాబాద్, ప్రతినిధి జూలై18, ముస్తాబాద్ మండల ఎంపిడిఓ రమాదేవి పారిశుద్ధ్య కార్మికులఫై అనుచిత వాక్యలను తీవ్రంగా కండిస్తూ జిల్లాసిఐటీయు, సిపిఎం నాయకులు ప్రధాన రహదారిఫై సుమారు 3 గంటలపాటు బయటాంచి ధర్నా రాస్తారోకో చేసారు. ఎంపిడిఓను వెంటనే సస్పెండు చేయాలనీ నినాదాలతో మండల కేంద్రం ఒక్కసారిగా హోరెత్తించారు.
    ఈసందర్భంగా వారు మాట్లాడుతూ….. స్థానిక ఎంపీడీవో రమాదేవి సపాకార్మికులు రాత్రినక పగలు అనక ఆడ మగ తేడా లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ వారిని గుర్తించాల్సింది పోయి నోటికి వచ్చినట్లు  మీరు చేసే పనికి ఈ జీతం మీకు ఎక్కువ అని చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సఫాయి కార్మికులు అంటే ఇంత చిన్నచూపు మీకు ఎందుకని ఎంపీడీవోను ఈసందర్భంగా ప్రశ్నించారు. స్థానిక మంత్రి కేటీఆర్ 13 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షను తెలిసికూడా తెలియనట్టుగా వ్యవహరించడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం అయ్యారు. ఇదిలా ఉండగా సఫాయి కార్మికుల సమస్యలకు నిరాహార దీక్ష చేస్తున్న దీక్షపై స్థానిక పోలీస్ సిబ్బంది రాత్రి అరెస్టు చేయడం తీవ్ర బాధాకరమని అన్నారు. గ్రామంలో సఫాయి బార్డర్ లో సిఫాయి ఇద్దరు ఒకటేనని ప్రత్యేకంగా సిఐటియు అన్నల్దాస్ గణేష్ మాట్లాడుతూ మండల ఎంపీడీవో నేడే తెలిసిన విషయం ఏమిటటే మాదళిత మహిళ అయి ఉండి అంబేద్కర్ లేనిది మీకు ఆ ఉద్యోగం లావచ్చేదని గుర్తుచేశారు. వెంటనే స్థానిక మంత్రి స్పందించి ఎంపీడీవో చేసిన వాక్యలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో జిపి సిఐటియు మండల అధ్యక్షులు జెల్లీలక్ష్మణ్, సిపిఎం పార్టీకార్యదర్శి మూసం రమేష్, సిఐటియు కార్యదర్శి కోడం రమణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎలిగేటి రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్రరాకేష్, వివిద మండలాల హోదాలను కలిగిన జిపి నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *