ముస్తాబాద్, ప్రతినిదీ వెంకటరెడ్డి అక్టోబర్ 22, బతుకమ్మ, దసరా అనగానే గ్రామం ప్రజలు కొండంత పొంగిపోతారు అందుకే మున్సిపాలిటీలలో గ్రామపంచాయతీలలో ఇటీవల పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యం గురించి లెక్కచేయకుండా ఏ పండుగ అనకుండా నిస్వార్ధంగా సఫాయి పనిని సిపాయిగా చేసుకుంటూ గ్రామాలను పరిశుభ్రత పాటించడంలో నిమగ్నమవుతున్నామని అన్నారు. జపి కార్మికులు మాట్లాడుతూ కొన్ని గ్రామాలలో జిపి పాలకులకు సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకోమని మాకార్మికులకు బోజనం పేరుతో సహాయం చేస్తున్నారని ముస్తాబాద్ కార్మికులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నాయకులూ వస్తున్నారు పోతున్నారు మాకు ఎలాంటి సహాయం ఇవ్వడం లేదని కార్మికులు మొహమాటం లేకుండా ఆరోపించారు. సఫాయి కార్మికులను ఇకనైనా గ్రామపంచాయతీ పాలకులు చేయి చేయి కలిపి దసరా పండుగ సందర్భంగా మా కార్మికుల కుటుంబాలకు జిపిలోనే భోజనాలు ఏర్పాటు చేయాలని జపి కార్మికులు కోరారు.
