ప్రాంతీయం

*డిసెంబర్ 4న చలో ఢిల్లి*

119 Views

*డిసెంబర్ 4న చలో ఢిల్లి* *రాజ్యాంగం రిజర్వేషన్లు దళితుల అభివృద్ధికై దళిత డిక్లరేషన్*

* కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిలుపు*

తెలుగు న్యూస్ 24/7

నిడమానూరు : అక్టోబర్ 22

డిసెంబర్ 4 చలో ఢిల్లీ రాజ్యాంగం రిజర్వేషన్లు దళితుల అభివృద్ధికై దళితుల డిక్లరేషన్ పోరాడుదామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య అన్నారు ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం కెవిపిఎస్ డిహెచ్పిఎస్ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనం నల్లగొండలో పాలడుగు నాగార్జున, బలుగూరి నరసింహ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాగయ్య మాట్లాడుతూ

దేశానికి స్వాతంత్రయం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్నదనీ కానీ అట్టడుగు వర్గాలైన దళితులు. గిరిజనులు. మహిళలు. మైనార్టీ. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు వారి దరి చేరలేదాని అన్నారు. తిరోగమన భావజాలం కలిగిన బిజెపి నేతృతములోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాజ్యాంగ హక్కుల పైన దాడిని తీవ్రతరం చేసిందనీ రాజ్యాంగానికి గుండెకాయ లాంటి ప్రజాస్వామ్యం సామ్యవాదం అనే పదాలను రాజ్యాంగ ప్రవేశిక నుండి తొలగించారనీ ఆవేదన వ్యక్తంచేశారు.

పౌరుల ప్రజాతంత్ర హక్కులపై ఉక్కు పాదం మోపుతుంది. రిజర్వేషన్లు సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్నదనీ భారత రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్నదనీ జనాభా దామాషా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించి వారి అభివృద్ధికి ఖర్చుపెట్టే ఎస్సి. ఎస్టి సబ్ ప్లాన్ చట్టాన్ని ఎత్తివేశారనీ అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తు ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయకా తన ఇష్టానుసారంగా ఉపాధిని కల్పిస్తున్న ప్రైవేట్ రంగంలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ చోలేటి ప్రభాకర్ మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డులు ఎత్తివేసి ప్రజా పంపిణీ వ్యవస్థను తీసివేయాలని కుట్ర పన్నుతున్నారనీ అభివృద్ధి పేరుతో అసైన్మెంట్ భూములను కిరాతకంగా లాక్కుంటున్నారనీ అసైన్మెంట్ చట్టానికి, తూట్లు పొడుస్తున్నారనీ ఎస్సీ, ఎస్టీ భూముల అభివృద్ధితో పాటుగా 100 రోజుల పని కల్పన కోసం వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్ర పన్నుతున్నారనీ. ప్రభుత్వ రంగ సంస్థలను నీరు కారుస్తున్నారనీ అన్నారు. దళిత గిరిజన మహిళల పైన దాడులు హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి కులాంతర వివాహాలు చేసుకున్న జంటలపై అగ్రకుల పెత్తందారుల దాడులు దాడులు పెరుగుతున్నాయని అన్నారు ప్రజలంతా ఐక్యమై ప్రజా ఉద్యమాలను నిర్వహించాలని అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ వెంకులు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు జెవివి రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి కేవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను డి హెచ్ పి ఎస్ జిల్లా కన్వీనర్ ఊరి పక్క వెంకటయ్య కే వి పి ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రేమిడాల పరిషరాములు సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ ప్రముఖ దళిత నాయకుడు ఒంటెపాక యాదగిరి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టేలా శివకుమార్ గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న చాకలి ఐలమ్మ ట్రస్ట్ జిల్లా బాధ్యులు బొల్లెపల్లి మంజుల గౌడ్. గీత సంగం జిల్లా నాయకులు పబ్బు వీరస్వామి గౌడ్ ఎం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు ఎరిగి శ్రీశైలం సన్నీ కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదే నరసింహ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య బొల్లు రవీందర్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లింగస్వామి లూర్దు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బారిగెల వెంకటేష్ లెనిన్* తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *