ములుగు జిల్లా,సెప్టెంబర్ 27
హైదరాబాదులోని బీసీ భవన్ లో జరిగిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జాతీయ ఉపా ధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వ ర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు.అట్టి కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టైగర్ ఆర్ కృష్ణయ్య పాల్గొని రైతాంగ సాయుధ పోరాట వీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ బీసీ భవన్ లో జరిగిన బాపూజీ జయంతి వేడుకల్లో ములుగు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బట్ట మురళీకృష్ణ ఉపాధ్యక్షుడు మంచెర్ల నాగేశ్వరరావు పాల్గొని నివాళులర్పించారు.




