బిజెపిరాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ
(మానకొండూర్ అక్టోబర్ 21)
మానకొండూరు నియోజకవర్గం నుంచి బిజెపి నుండి అవకాశం వస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నాను రానిపక్షంలో బిజెపి రెబల్ గా పోటీ చేస్తాను. బండి సంజయ్ శిష్యునిగా ప్రచారంలో సంజయ్ ఫోటో పెట్టి అంబేద్కర్, సాకలి ఐలమ్మ, సర్వే పాపన్న, జ్యోతిరావు పూలే, చత్రపతి శివాజీ, స్వామి వివేకనంద ఫొటోస్ పెట్టుకుని ప్రచారంలో దిగుతాను అన్ని కులాలు కళాకారులు దళిత సంఘాలు యువజన సంఘాలు అన్ని సంఘాల మద్దతు నాకు ఉంది గత 15, 20 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గము నుండి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం లో తెలంగాణ యువజన సంఘాల సమితిలో దళిత సంఘాలలో పనిచేసిన అనుభవం కునుకుల కొండాపూర్ సర్పంచిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. పోటీచేసిన అనుభవం ఉంది ప్రజారాజ్యం పార్టీలో నియోజకవర్గ ఇన్చార్జిగా కష్టపడి పనిచేసిన అనుభవం దళిత సంఘాలలో దళిత సమస్యల పట్ల పోరాడి దళితుల పక్షాన నిలబడినటువంటి వ్యక్తిగా దళిత గర్జన పేరుతో గజ్జలకాంతం నాయకత్వంలో నియోజకవర్గంలో బహిరంగ సభలు ఏర్పాటు చేశాను.
ప్రతి మండలంలో నాకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని ఈ నియోజకవర్గం నుండి ఈసారి పోటీ చేయడానికి టిక్కెట్ వస్తే సంతోషం, రాకపోతే రెబల్ గా పోటీ చేసి నా సత్తాను చాటుతాను సీటు నాదే గెలిచేది నేనే నియోజకవర్గ ప్రజలారా అక్కచెల్లెల్లారా అన్న దమ్ముల్లారా మేధావి వర్గం ఉద్యమకారులు కళాకారులు కుల సంఘాలు అందరూ నాకు మద్దతు ఇవ్వాలని దయతో మీ అందరినీ కోరుతున్నాను.