(మానకొండూర్ అక్టోబర్ 15 )
మానకొండూర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరో మారు పోటీ చేసేందుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీ ఫామ్ అందుకున్నారు.
హైదరాబాదులోని ప్రగతి భవన్ లో సీఎం, కేసీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదివారం బీఫామ్ ను అందుకున్నారు. ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటి చేసి గెలిచిన ఎమ్మెల్యే రసయి బాలకిషన్, ముచ్చటగా 3వ సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి మానకొండూర్ నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధిమా వ్యక్తం చేశారు..