ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 21, మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో మహిళా సాధికారిక సదస్సు 10వ.తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థినీలతో కార్యక్రమం శుక్రవారం సాయంకాలం నిర్వహించారు. మహిళా సాధికారిక సదస్సును పురస్కరించుకుని ప్రభుత్వం తొలిసారిగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి మోహినిగుంట గ్రామపంచాయతీ ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక చేసింది స్వయం సమృద్ధితో మౌలిక సదుపాయాలు గల గ్రామపంచాయతీగా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామానికి రాష్ట్రస్థాయిలో గ్రామ సర్పంచ్ గ్రామాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సుర్గాపాల్గొని గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళుతున్న తరుణంలో సర్పంచ్ వనజ కు ఉత్తమ మహిళా అవార్డు ఇదివరకే అందుకున్నారు. ఆ సర్పంచి కల్వకుంట్ల వనజను శాల్వాతో సత్కరించిన విషయం విధితమే. ఈకార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, ఎంపీడీఓ రమాదేవి, బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి, ఉప సర్పంచ్ నరాయనోజు సంధ్య, కరీంనగర్ కేడిడిసి బ్యాంక్ మేనేజర్ కల్వకుంట్ల హరిత, కల్వకుంట్ల గీత, మోహినికుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాపురెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మణ్ గౌడ్, డిడబ్ల్యువొ దేవిక, సఖీ కేంద్రం దీపికా, కార్యదర్శి గీత, మోహినికుంట గ్రామశాఖ అధ్యక్షుడు నారాయనోజు సతీష్, అంగన్ వాడి నిర్వాహకులు శీలం లత ,పల్లాటి భాగ్యలక్ష్మి, సిఏలు రమ్య, లత, సాకట్ సోని, మహిళలు, సోషల్ మీడియా వారియర్ పరిధిపేట వెంకటేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
