ప్రకటనలు

ఫ్లయింగ్ స్క్వాడ్,స్టాటికల్ సర్వలేన్స్ బృందాల పాత్ర కీలకం

224 Views

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించడంలో ఫ్లయింగ్ స్క్వాడ్,స్టాటికల్ సర్వలేన్స్ బృందాల పాత్ర కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.

గురువారం రోజున ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటికల్ సర్వలేన్స్ బృందాలకు, జిల్లా పోలీస్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్య నాయక్ తో కలసి బృందాలకు ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ…ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఫ్లయింగ్ స్క్వాడ్,స్టాటికల్ సర్వలేన్స్ బృందాలు కీలక పాత్ర పోషించాలన్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని, రికార్డులు నిర్వహించాలని, ప్రతి వాహనం యెక్క నెంబర్ రాయలన్నారు.వాహనాల తనిఖీ, జప్తు చేసినటువంటి నగదు,ఇతర సమాచారానికి సంబంధించిన రికార్డు సమాచారాన్ని, నిర్దిష్ట ఫార్మాట్ లలో సంబంధిత అధికారుల ద్వారా రోజువారీగా పంపించాలని, జప్తు చేసిన వాటికి రశీదు ఇవ్వాలని అన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *