ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్19, కేంద్ర సర్వీసుకు చెందిన అసిస్టెంట్ సెక్షన్ అధికారులు శిక్షణలోభాగంగా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో పలుఅంశాలు పరిశిలించారు. దీనిలో భాగంగా గ్రామంలో గ్రామ పంచాయతీ రికార్డులు ,వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, రైతువేదిక, రేషన్ దుకాణంలో సరుకుల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి సెంటర్, పల్లె దావకాన, ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బృందం సభ్యులు శూనం అభిజిత్ జయలత, ప్రదేశ్ ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని కూడళ్లు పెద్ద ఇండ్లకు వెళ్ళి స్వభుత్వ పథకాల గురించి అక్టోబర్20 వరకు గ్రామంలో సమీక్షీంచనున్నారని వార్డు సభ్యులు తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ చెర్లపల్లి రజత-సుధాకర్ రెడ్డి, ఉపసర్పంచి నాగరాజు, ఎంపిటిసి, వార్డు సభ్యులు ఊరడి రాజు, బనక రాజెల్లవ్వ, బనుక నాగరాజు యాదవ్, కార్యదర్శి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
